CULTURAL SPLENDOUR ENCHANTS DEVOTEES DURING SARVA BHOOPALA VAHANA SEVA _ సర్వభూపాల వాహనసేవలో భారతీయ సంస్కృతీ కళా వైభవం

CULTURAL SPLENDOUR ENCHANTS DEVOTEES DURING SARVA BHOOPALA VAHANA SEVA _ సర్వభూపాల వాహనసేవలో భారతీయ సంస్కృతీ కళా వైభవం
CULTURAL SPLENDOUR ENCHANTS DEVOTEES DURING SARVA BHOOPALA VAHANA SEVA _ సర్వభూపాల వాహనసేవలో భారతీయ సంస్కృతీ కళా వైభవం
BRAVING RAINS DEVOTEES WITNESS CULTURAL PROGRAMS
Tirumala, 15 October 2026: A total of 437 artistes from 16 troupes across 7 States presented vibrant folk, classical and devotional performances as a part of the ongoing Srivari Navaratri Brahmotsavams, which enthralled devotees during the Sarva Bhupala Vahana Seva on Thursday evening.
Different states presented a rich blend of folk, classical and devotional art forms along the Mada streets, adding grandeur to the sacred procession.
Artistes from Uttarakhand presented the graceful Ghasiyari dance, depicting the work songs of women harvesting crops in the hill valleys. The Karnataka troupe performed the traditional Pattakunitha martial dance with rhythmic stick movements, while artistes from Telangana presented the captivating Gussadi dance of the Raj Gond tribe, adorned with peacock feathers.
The energetic Khajri folk dance of Uttar Pradesh, performed to the beats of a small pot-shaped instrument, drew appreciative response.
Young artistes from Andhra Pradesh, dressed as Sri Krishna, presented Krishna Leela and scenes from Brindavan, immersing devotees in devotional fervour.
The Rajasthan troupe, in colourful Ghagras, showcased the folk culture of the desert state through traditional songs and dance.
Women troupes from Maharashtra and Adoni in Kurnool district energised the gathering with impressive drum performances.
Students of Sri Venkateswara College of Music and Dance presented Bharatanatyam and a Kuchipudi dance ballet, beautifully depicting the majesty of the Sarva Bhoopala Vahana Seva.
The vibrant presentations turned the Mada streets into a grand stage of devotion, art and culture, reflecting India’s rich cultural heritage.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సర్వభూపాల వాహనసేవలో భారతీయ సంస్కృతీ కళా వైభవం
ఏడు రాష్ట్రాల నుంచి 16 కళాబృందాలు.. 437 మంది కళాకారుల అద్భుత ప్రదర్శనలు
గాన, వాద్య, నృత్య ప్రదర్శనలతో భక్తులను అలరించిన కళాకారులు
తిరుమల, 2026 అక్టోబరు 15: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు గురువారం రాత్రి నిర్వహించిన సర్వభూపాల వాహనసేవ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏడు రాష్ట్రాలకు చెందిన 16 కళాబృందాల్లోని 437 మంది కళాకారులు తమ గాన, వాద్య, నృత్య ప్రదర్శనలతో తిరుమాడ వీధుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ఆవిష్కరించారు.
వివిధ రాష్ట్రాల జానపద కళారూపాల కనువిందు
ఉత్తరాఖండ్‌కు చెందిన గసియారి నృత్యం, కర్ణాటక సంప్రదాయ వీరనృత్యం పట్టకునిత, తెలంగాణ రాజ్‌గోండ్ తెగకు చెందిన గుస్సాడి నృత్యం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖజరి జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో ప్రదర్శించిన కృష్ణలీలలు, బృందావన ఘట్టాలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. రాజస్థానీ కళాకారులు రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణతో జానపద గీతాలను ప్రదర్శించి ఆ రాష్ట్ర ఎడారి సంస్కృతిని ప్రతిబింబించారు.
మహారాష్ట్రతో పాటు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా కళాకారులు ప్రదర్శించిన డప్పు విన్యాసాలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
శాస్త్రీయ నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి నృత్యరూపకాల ద్వారా సర్వభూపాల వాహనసేవ వైభవాన్ని భక్తిభావంతో ప్రదర్శించారు.
భారతీయ కళా సంప్రదాయాలకు వేదికగా బ్రహ్మోత్సవాలు
దేశంలోని వివిధ ప్రాంతాల జానపద, సంప్రదాయ, శాస్త్రీయ కళారూపాలు ఒకే వేదికపై ప్రదర్శితమవడంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత సాంస్కృతిక శోభ చేకూరింది. భక్తి, కళ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలు భక్తులకు కనువిందు చేశాయి.

















































